రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. హరీశ్ శంకర్ దర్శక త్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రవితేజ స్వతహాగా బిగ్‌బి అమితా బ్ బచ్చన్‌కు వీరాభిమాని. చాలా సినిమాల్లో సందర్భానుసారంగా ఆయన్ని అనుకరిస్తూ కనిపించారు. ఇప్పుడు ఆయన పేరును స్ఫురించే టైటిల్‌తో రవితేజ సినిమా చేయడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని కారంపూడిలో చిత్రీకరణ జరుపుకుంటున్నది. రవితేజతో పాటు చిత్ర ప్రధానతారాగణం పాల్గొంటున్నారు. వింటేజ్ లుక్‌లో రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన బ్యాగీ ప్యాంట్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రవితేజ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుం దని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శక త్వం: హరీష్‌శంకర్.
