Namaste NRI

రవితేజ మాస్ జాతర.. రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ 75వ చిత్రానికి మాస్‌ జాతర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకత్వం.  ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో జాతర సందడి నడుమ తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్నారు రవితేజ. టైటిల్‌కు తగినట్లుగానే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు తెలిపారు. అభిమానులకు విందుభోజనంగా ఈ సినిమా ఉంటుందని, రవితేజ అభిమానులు కోరుకునే అన్ని అంశాలుంటాయని చిత్రబృందం తెలిపింది.  ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events