Namaste NRI

ఆషికాతో రవితేజ ఆటాపాటా!

హీరో రవితేజ, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. హీరో రవితేజ, హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకమైన సెట్‌ వేశారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ లో రూపొందుతున్న ఈ పాట అదిరిపోయే డ్యాన్స్‌ నంబర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఎమోషనల్‌ కథలతో అలరించే దర్శకుడు కిశోర్‌ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు అని చిత్రయూనిట్‌ తెలిపింది. రవితేజ, ఆషికా రంగనాథ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ : ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజరు కుమార్‌ చాగంటి, రచన-దర్శకత్వం: కిషోర్‌ తిరుమల.

Social Share Spread Message

Latest News