భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.పాక్ విషయంలో ఆఫ్ఘాన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. సరిహద్దుల్లో భారత్ డర్టీగేమ్స్ ఆడుతోందని వ్యాఖ్యానించారు. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి ఇప్పటికే వ్యూహాలను రూపొందించినట్లు ఈ సందర్భంగా ఆసిఫ్ తెలిపారు. అయితే, యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చర్చించలేనంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు.
















