ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం తమదని, ట్రంప్‌ది సంపన్నుల రాజ్యమని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న భారతీయ అమెరికన్ కమలా హారిస్ పేర్కొన్నారు. బిలియనీర్లు, పెద్ద కార్పొరేట్ సంస్థల మద్దతుతో ట్రంప్ బరిలో నిలిచారని, తాను ప్రజల మద్దతుతో ప్రచార బరిలో దిగానని తెలిపారు. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ నామినేట్ చేశాక తొలిసారిగా విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ లో జరిగిన ప్రచార సభలో హారిస్ మాట్లాడారు. పెద్ద చమురు కంపెనీలతో రెండు నెలల కిందట ఆయన వంద కోట్ల డాలర్లకు కుదుర్చుకున్న ప్రచార ఒప్పందాన్ని చూశాం. మరోవైపు క్షేత్ర స్థాయిలో ప్రజలిస్తున్న విరాళాల తో మన ప్రచారం సాగుతోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో ప్రజలు విరాళాలు ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంవల్లే ఇది సాధ్యమైంది అని పేర్కొన్నారు.