అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఉగ్రం ఉగ్రం రుద్ర ఫాలనేత్రం, మృత్యు తీక్ష వీక్షణ అంటూ ఈ పాట కథానాయకుడి పోరాటాన్ని వర్ణిస్తూ సాగింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందించారు. చైతన్య ప్రసాద్ రచన చేసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల స్వయంగా ఆలపించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నగరంలో మిస్సింగ్ కేసుల్ని ఛేదించడానికి అతను ఎలాంటి ఆపరేషన్ చేపట్టాడన్నదే కథాంశమని, సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.

ఈ చిత్రానికి కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: తూమ్ వెంకట్, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన-దర్శకత్వం: విజయ్ కనకమేడల. ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

