దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్య పథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు జరిగింది. అపాచి తో పాటు ప్రచండ తేలికపాటి హెలీకాప్టర్ ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐరోపా సమాఖ్య కు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలల్లో పాల్గొంది.దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిద్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్ లో వాడిన ప్రధాన ఆయుధాలు వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా , ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్స్ లా వానడెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వేలాది మంది వీక్షకులు పాల్గొన్నారు.






























