Namaste NRI

రేవు ఆడియో రిలీజ్

వంశీరామ్‌, అజయ్‌, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రేవు. హరినాథ్‌ పులిచెర్ల దర్శకుడు. ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీత రచయితలు చంద్ర బోస్‌, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, అనంత్‌శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్‌ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ మాట్లాడుతూ ఈ సినిమాకు పాటలు రాసిన ఇమ్రాన్‌ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో, పాటలు కూడా అంతే వైవిధ్యంగా ఉన్నాయని అన్నారు. ఈ సినిమాలో మత్స్యకారుల జీవన సంఘర్ష ణను చూపించామని చిత్ర నిర్మాణ పర్యవేక్షకులు ప్రభు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కథతో ఈ సినిమాను తెరకెక్కించామని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పర్వతనేని రాంబాబు చెప్పారు. ఈ చిత్రం మత్స్యకారు ల జీవితానికి ప్రతిబింబంలా ఉంటుందని దర్శకుడు హరినాథ్‌ పులిచెర్ల పేర్కొన్నారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: వైశాఖ్‌ మురళీధరన్‌, నిర్మాతలు: డా॥ మురళీ గింజుపల్లి, నవీన్‌ పారుపల్లి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress