
శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ చిత్రం కలియుగమ్ 2064. ప్రమోద్ సుందర్ దర్శకుడు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని కె.ఎస్.రామకృష్ణ నిర్మించారు. మే 9న విడుదలకానుంది. తెలుగులో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తున్నది. ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. 2064లో ఏర్పడే విపత్కర పరిస్థితుల్లో మనుగడ కోసం మానవులు చేసే పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. తెలుగు ప్రేక్షకులకు ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు.
