Namaste NRI

రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబా లకు షాక్

బ్రిటన్ ప్రభుత్వం కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. బ్రిటన్‌లో శాశ్వత నివాసం ఏర్పర్చుకు న్న వారు భారతీయ సంతతివారైనా ఇతరులైనా తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడం ఇప్పుడిక సులువు కాదు. ఫ్యామిలీ వీసాకు వార్షిక ఆదాయ పరిమితిని 55 శాతానికి పెంచుతూ బ్రిటన్ ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి వలసలను అరికట్టాలనే విధాన నిర్ణయాలలో భాగంగా ఈ నిర్ణయం అమలులోకి తీసుకువచ్చారు. వేతన లేదా ఆదాయ పరిమితి వార్షిక స్థాయి పెంపుదలతో ఇక ఫ్యామి లీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి కనీస వార్షిక వేతనం ఇకపై 29000 పౌండ్లు (జిబిపి) ఉండాల్సిందే.

ఇంతకు ముందు ఇది 18,600 పౌండ్లు ఉండేది. ఫ్యామిలీ వీసా వార్షిక వేతన పరిమితిని పెంచాలని రిషి సునాక్ ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయించింది. దీనిని స్కిల్డ్ వర్కర్స్ వీసాతో సమానం చేయాలని తలపెట్టారు. కాగా ఈ విషయం ఇప్పుడు ఈ నెల 11వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌ లో ఆదాయం స్థాయిని బట్టే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను దేశానికి తీసుకురావడం లేదా ఇక్కడ వారికి ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. దేశంలోకి చట్టపరమైన వలసల ప్రక్రియతోనే తలెత్తుతున్న పలు సమస్యల నియంత్రణకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమని వెల్లడైంది. రిషి సునాక్ ప్రభుత్వం తమ దేశంలోని టాక్స్ పేయర్స్‌కు వలసదార్ల వల్ల అదనపు భారం పడకుండా చేసేందుకు సంకల్పించిందని అధికారవర్గాలు తెలిపాయి. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress