Namaste NRI

లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల మృతి 

లండన్‌లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు కారుల్లో తిరిగి వస్తుండగా ఒకదానినొకటి ఢీకొనడంతో తర్రె చైతన్య యాదవ్‌ (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ రాపోలు (21) మృతి చెందారు. కాగా, మరణించిన చైతన్య యాదవ్‌ బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌కు చెందిన ఐలయ్య, మల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు. ఎంటెక్‌ చదవడానికి ఏడు నెలల క్రితం లండన్‌కు వెళ్లాడు.

ఈ ప్రమాదంలో నూతన్‌ తాటికాయలకు పక్షవాతం రాగా, సాయి గౌతమ్‌ రావుళ్ల వెంటిలేటర్‌పై ఉన్నాడు.ఈ ప్రమాదానికి సంబంధించి ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, మిగిలిన వారు రాయల్‌ లండన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. యూకేలోని ఎస్సెక్స్‌ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన డ్రైవింగ్‌ కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టు ఎస్సెక్స్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

Social Share Spread Message

Latest News