Namaste NRI

ఆదికేశవ నుంచి రొమాంటిక్‌ మెలోడి సాగ్‌

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆదికేశవ. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డిని దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జి.వి.ప్రకాశ్‌ స్వరాలందించిన సిత్తరాల సిత్రావతి  పాట ఇటీవల విడుదల చేస్తే ఆ పాట విపరీతంగా ఆదరణ పొందుతున్నది. ఈ నేపథ్యంలోనే మరోపాటు మేకర్స్‌ విడుదల చేశారు. ఇది పూర్తి రొమాంటిక్‌ మెలోడి సాగ్‌. హే బుజ్జి బంగారం  అని సాగే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్‌తేజ్‌ డాన్స్‌ మూమెంట్స్‌ వైరల్‌గా మారి, ప్రేక్షకుల మెప్పును పొందుతున్నాయని తెలుస్తుననది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను ఆర్మాన్‌ మాలిక్‌, యామిని ఘంటసాల ఆలపించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress