సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా టక్కర్. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. కార్తిక్ జీ. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని పెదవులు వీడి మౌనం అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నివాస్ కే ప్రసన్న స్వర పరిచిన ఈ పాటను దీపక్ బ్లూ, చినమయి శ్రీపద ఆలపించారు. ఇప్పటికే రిలీజైన కయ్యాలే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే రిలీజైన టీజర్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతుంది.