Skip to main content

Namaste NRI

సిద్ధార్థ్‌ టక్కర్‌ మూవీ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌

సిద్ధార్థ్‌ కథానాయకుడిగా  నటిస్తున్న సినిమా  టక్కర్‌. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు.  కార్తిక్‌ జీ. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమా మే 26న రిలీజ్‌ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని పెదవులు వీడి మౌనం అనే రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. నివాస్‌ కే ప్రసన్న స్వర పరిచిన ఈ పాటను దీపక్‌ బ్లూ, చినమయి శ్రీపద ఆలపించారు. ఇప్పటికే రిలీజైన కయ్యాలే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే రిలీజైన టీజర్‌ యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్‌ అవుతుంది.

Social Share Spread Message

Latest News