యాపిల్ ఉత్పత్తులపై రష్యా ఆర్మీ నిషేధం విధించింది. ఆర్మీ ఆదేశాలతో రష్యన్ ఆర్మీ ఇకపై ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్స్‌ను ఉపయోగించలేరని మంత్రి మక్సూత్ షాదేవ్ పేర్కొన్నారు. రష్యా డిజిటల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ పనిలో ఉన్న ఉద్యోగులు ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ల వాడకంపై నిషేధం విధించినట్లు నివేదిక పేర్కొంది. సైన్యం ఇకపై ఆపిల్‌కు చెందిన ఐఫోన్లు, ట్యాబ్‌లను అధికారిక కార్యకలాపాలతో పాటు ఈ-మెయిల్స్ కోసం ఉపయోగించలేరని స్పష్టం చేసింది.అయితే, వ్యక్తిగత అవసరాల కోసం ఐఫోన్లను ఉపయోగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, సంస్థపై వచ్చిన ఆరోపణలను ఆపిల్ ఖండించింది. ఇదిలా ఉంటే రష్యన్ ఆర్మీకి సంబంధించిన కంటెంట్‌ను తొలగించనందుకు ఆపిల్‌కు జరిమానా విధించింది. ఈ కంటెంట్ ఉక్రెయిన్ సైనిక చర్యకు సంబంధించింది కావడం గమనార్హం.