భారత్ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం భారత్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్ చిత్రంలోని ఓ పాటకు రష్యా ఎంబసీ ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
