బ్రిక్స్ కూటమిలో సభ్యత్వానికి పాకిస్థాన్ దరఖాస్తు చేసింది. ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని రష్యాను కోరినట్టు మాస్కోలోని పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలి తెలిపారు. ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాకు సంక్షిస్త రూపమే బ్రిక్స్. వచ్చే ఏడాది తమను కూడా కూటమిలో చేర్చాలని పాక్ కోరుతున్నది.
