రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నారు. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నట్లు ప్రకటనలో చెప్పారు. తజక్ నేత ఎమ్మోమలి రెహమాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ మాట్లాడారు. అయితే తాను ఉంటున్న ప్రదేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని, కొన్ని రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు. పుతిన్‌కి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయింది. రష్యాలో తయారైన స్పుత్నిక్`వీ టీకా రెండో డోసును ఆయన ఏప్రిల్‌లోనే తీసుకున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.