సాయిదుర్గ తేజ్ హీరోగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని నిర్మాత నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ రాకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 1940 బ్యాక్‌డ్రాప్ కథాం శంతో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. విరూపాక్ష తర్వాత కొత్త సినిమా కు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వని సాయి దుర్గ తేజ్ షూటింగ్ అప్‌డేట్ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ ఏడాది జులై సెట్స్‌పైకి వెళ్తనుంది. లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ మేకప్ వేసుకు నేందుకు రెడీ అవుతుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు, ఫాలోవర్లు.