లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ జపాన్‌లో తన తొలి హిందీ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నది. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి సాయిపల్లవి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జపాన్‌లోని సపోరోలో షూటింగ్ జరుగుతున్నది. అక్కడ జరిగే సంప్రదాయ మంచు పండగ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సపోరోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. సునీల్‌పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాతో పాటు నితీష్ తివారి తెరకెక్కించబోతున్న రామాయణ చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రలో నటించబో తున్నది. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్‌లో నటిస్తున్నది సాయిపల్లవి.
