రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం సకుటుంబానాం. ఉదయ్‌శర్మ దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీనాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రమిది. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఎంతో మంది సీనియర్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. రొటీన్‌కు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని నిర్మాత మహదేవ గౌడ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి, సంగీతం: మణిశర్మ.