టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత అమెరికా పయనమై వెళ్లారు. హడావుడిగా తన తల్లితో కలిసి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. అయితే, గత కొన్నిరోజులుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్, దాని చికిత్స కోసం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాధి చికిత్సకు అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ అమెరికా పయనమవడంతో అందరూ చికిత్స కోసమే అని అనుకుంటున్నారు. అయితే, సామ్ అమెరికా వెళ్లింది చికిత్స కోసం కాదట. ఇటీవలే సమంతకు అరుదైన గౌరవం లభించిన విషయం తెలిసిందే. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో పాల్గొనే అవకాశం లభించింది. ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సామ్ పాల్గొనబోతోంది. ఆ వేడుకల కోసమే సమంత తన తల్లితో కలిసి అమెరికా బయలు దేరి వెళ్లినట్లు తెలిసింది.
కాగా, ఈ వేడుకలకు సామ్‌తో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందింది. గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్, రానా, అల్లు అర్జున్, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్, తమన్నాలు హాజరయ్యారు.