Namaste NRI

సందీప్‌ కిషన్‌ చిత్రం ప్రారంభం

సందీప్‌కిషన్‌ 30వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం. రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, కామెడీ అంశాల కలబోతగా తెరకెక్కిస్తున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సందీప్‌కిషన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది.

సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు త్రినాథ రావు నక్కిన తనదైన శైలి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్‌ షఫీ, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన.

Social Share Spread Message

Latest News