సందీప్‌కిషన్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా ఓ చిత్రం నిర్మిస్తు న్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం. ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, అగ్ర నిర్మాత దిల్‌రాజు క్లాప్ ఇచ్చారు.మరో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. తదనంతరం చిత్ర యూనిట్‌కు వారందరూ శుభాకాంక్షలు అందించారు. సందీప్‌కిషన్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రచన: ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: లియోన్ జేమ్స్, ఆర్ట్స్: బ్రహ్మకడలి.