Namaste NRI

ఆ డైరెక్టర్‏తో సందీప్ కిషన్ కొత్త సినిమా

హీరో సందీప్‌కిషన్‌ హీరోగా మరో క్రేజీ మూవీ మొదలుకానుంది. నక్కిన త్రినాథరావు ఈ చిత్రానికి దర్శకత్వం. సందీప్‌కిషన్‌ 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి రాజేశ్‌ దండా నిర్మాత. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. త్రినాథరావు నక్కిన, ప్రసన్నకుమార్‌ బెజవాడ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. సందీప్‌ ఇందులో డిఫరెంట్‌ కేరక్టర్‌లో కనిపించనున్నారని, అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపొందనున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, నిర్మాణం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events