
నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం రాకాస. నయన్ సారిక హీరోయిన్. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తుండగా మాసన శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రారంభంలో ఎంతో గంభీరంగా సాగుతూ, యుగయుగాలుగా ప్రతీ కథలోనూ ఒక సమస్య ఉంటుందని, దాన్ని పరిష్కరించేందుకు ఒక వీరుడు పుడతాడని, ఆ వీరుడు తనేనంటూ హీరో ఇచ్చే ఎలివేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే వెంటనే కథలో కామెడీ, సెటైరికల్ ట్విస్ట్ మొదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించనున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక కొణిదెలతో కలిసి ఉమేష్‌కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.















