ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతికి వస్తున్నాము సాంస్కృతిక మీవాత్సవం ఖతార్‌లోని ఆల్‌వక్రాలో ఉన్న డీపీఎస్ ఎమఐఎస్ పాఠశాలలో వైభవంగా నిర్వహించారు. హరిదాసు, కోడిపుంజు, గాలిపటం, పాలు పొంగించే సంప్రదాయ అలంకరణలు వేదికను మకర సంక్రాంతి పండుగలా మార్చాయి. ఏకేవీ కమిటీ సభ్యులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏకేవీ అధ్యక్షుడు రమణయ్య కమిటీ సభ్యులు, వేదిక సభ్యుల సహకారాన్ని ప్రశంసించారు. నటి భూదేవి నత్యం, జానపద గాయకులు, సరళ, జాన్ పాడిన గీతాలు ఆహుతులను పల్లె వాతావరణానికి తీసుకెళ్లాయి. టీడీ జనార్దన్ ( అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్) మాట్లాడుతూ తెలుగు భాష, యాస, తెలుగు రాష్ట్ర కీర్తిని ప్రపంచ తెలుగు దేశాలకు తెలియజేసిన ఎన్టీఆర్ గురించి అద్భుతంగా వర్ణించారని మంథని వాస్తవ్యుడు రామడుగు వేణుగోపాల్ ఊతార్ నుంచి వివరించారు.


సుమారు 80 మంది కళాకారుల భాగాస్వామ్యంతో నత్య నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. 40 మంది కళాకారులతో శ్రీకష్ణ లీల ప్రదర్శన అలరించింది. కష్ణ చైతన్య, మాళవిక యుగళ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. డాన్స్ మాస్టర్లు సత్య, తేజస్విని తమ డ్యాన్స్‌తో ఉత్సాహం నింపారు. నటుడు పథ్వీ కుమార్తె శ్రీలు చేసిన నత్యం ఆకట్టుకుంది. ఖతార్‌లోని భారత రాయబారి విపుల్ ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు.
















