తమిళ నటుడు కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో సర్దార్ ఒకటి. అయితే ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ను రాబోతున్న విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయకగా నటిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ చేసుకున్నట్లు కార్తీ ప్రకటించాడు. థాయిలాండ్‌లోని హావా హిన్ ఎయిర్‌పోర్ట్‌లో చిత్రయూనిట్‌తో కేక్ కట్ చేస్తూ, సర్థార్ 2 షూటింగ్ పూర్తయినట్లు తెలిపాడు.

సర్దార్ 2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. పార్ట్ 1కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా పని చేయగా, సీక్వెల్‌కు యువన్ శంకర్ రాజాను తీసుకోవడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అంతేకాకుండా, ఈ సీక్వెల్‌లో స్టార్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు. సర్దార్ 2 చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.
