ఎండీ నజీరుద్దీన్, సీతా మహాలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా భారత్ కీ నారీ. డీఎస్ఆర్ ప్రొడక్షక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎండీ నమీరుద్దీన్ నిర్మిస్తున్నారు. డీఎస్ రాథోడ్ దర్శకుడు. తెలుగు, హిందీలో రూపొందిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత బెక్కిం వేణుగోపాల్ అతిథిగా హాజరై చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు డీఎస్ రాథోడ్ మాట్లాడుతూ కుటుంబాలను వదిలిపెట్టి దేశ రక్షణ కోసం సరిహద్దులకు వెళ్తారు సైనికులు. ఆ కుటుంబాన్ని సంరక్షించుకునే క్రమంలో సైనికుల సతీమణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేశభక్తి, ప్రేమ వంటి అంశాలతో సినిమా సాగుతుంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నాం. సెప్టెంబర్ చివరకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, సుభద్ర రెడ్డి, మారి ప్రవీణ్ కుమార్, కల్నల్ రామారావు తదితరులు పాల్గొన్నారు.