Skip to main content

Namaste NRI

సరి కొత్త కాన్సెప్ట్‌ తో వస్తోన్న భారత్‌ కీ నారీ

ఎండీ నజీరుద్దీన్‌, సీతా మహాలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా భారత్‌ కీ నారీ.  డీఎస్‌ఆర్‌ ప్రొడక్షక్షన్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎండీ నమీరుద్దీన్‌ నిర్మిస్తున్నారు. డీఎస్‌ రాథోడ్‌ దర్శకుడు. తెలుగు, హిందీలో రూపొందిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత బెక్కిం వేణుగోపాల్‌ అతిథిగా హాజరై చిత్ర బృందానికి విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు డీఎస్‌ రాథోడ్‌ మాట్లాడుతూ కుటుంబాలను వదిలిపెట్టి దేశ రక్షణ కోసం సరిహద్దులకు వెళ్తారు సైనికులు. ఆ కుటుంబాన్ని సంరక్షించుకునే క్రమంలో సైనికుల సతీమణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేశభక్తి, ప్రేమ వంటి అంశాలతో సినిమా సాగుతుంది. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుతున్నాం. సెప్టెంబర్‌ చివరకు చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, సుభద్ర రెడ్డి, మారి ప్రవీణ్‌ కుమార్‌, కల్నల్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events