Namaste NRI

ఒక్క శనివారం సరిపోదు.. ఇది వీకెండ్‌కు మాత్రమే పరిమితమయ్యే సినిమా కాదు: నాని

నాని  కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించిన సరిపోదా శనివారం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. నాని మాట్లాడుతూ ఈ సినిమా విడుదల రోజు నుంచే ఎన్నో ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి. థియేటర్స్‌లో ఆడియెన్స్‌ జోష్‌ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మంచి సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి నిరూపితమైంది అన్నారు.  ఇది కేవలం వీకెండ్‌కు మాత్రమే పరిమితమయ్యే సినిమా కాదు. లాంగ్‌ రన్‌ ఉండబోతున్నది. ఇంత వర్షంలో కూడా అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్స్‌ అవుతున్నా యి. నిర్మాత దానయ్యగారి సంస్థలో మరో హిట్‌ కొట్టడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక్క శనివారంతో ఆగిపోదు, ఎన్నో శనివారాలను దాటుకొని వెళుతుంది అన్నారు.

హీరో నాని ఇచ్చిన ఫ్రీడమ్‌ వల్లే సినిమాను అనుకున్న విధంగా తీయగలిగానని, ఇంత లార్జ్‌స్కేల్‌ ఉన్న సినిమాను నేను తీస్తానని నమ్మిన నిర్మాత దానయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెప్పారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనే ఈ సినిమా భారీ సక్సెస్‌ ఖాయమని ఊహించానని, ఈ నెల 5న గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించబోతున్నామని నిర్మాత డీవీవీ దానయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, సాయికుమార్‌, కథానాయిక ప్రియాంక మోహన్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events