Namaste NRI

సత్యదేవ్ గరుడ ఫస్ట్‌ లుక్‌

విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనే సత్యదేవ్ తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. నిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు  క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా  కొత్త సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి గరుడ చాప్టర్-1 అనే స్ట్రయికింగ్ టైటిల్‌ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని కూడా విడుదల చేశారు మేకర్స్. సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని మోస్తూ అడవిలో నిలబడి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో గొడ్డలితో కనిపించారు. అతని వెనుక ఒక కుక్క నిలబడి ఉంది. చెట్లకు నిప్పంటండం కనిపిస్తోంది.

పోస్టర్‌ లో సత్యదేవ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ గెటప్ చాలా కొత్తగా వుంది. లుంగీ ధరించి కనిపించారు సత్యదేవ్. క్రాంతి బాల సత్య దేవ్‌ ను మునుపెన్నడూ చూడని అవతార్, యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్, పవర్ ఫుల్  స్క్రిప్ట్‌ ను రాశారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గరుడ సత్యదేవ్‌ కు అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందించిన చిత్రం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events