సౌదీ అరేబియాలో పనిచేస్తున్న లేదా ఉపాధి కోసం కొత్తగా అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకు ఆదేశం షాక్ ఇచ్చింది. వర్క్ వీసా జారీకి సంబంధించి నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ, కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే వీదేశీ కార్మికుల రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) నిబంధనల్ని కూడా సవరించింది. వర్క్ వీసా జారీకి ఇకపై జాబ్ లెటర్ తప్పనిసరి కానున్నది. మార్పులు జనవరి 14 నుంచి అమల్లోకి వస్తున్నాయని భారత విదేశాంగ శాఖ, ఆ దేశంలోని భారతీయ సంఘాలు వెల్లడించాయి. వర్క్ వీసాపై సౌదీ వెళ్లాలనుకునే భారతీయులు ఇకపై తమ విద్య, వృత్తికి సంబంధించి అర్హతలపై ముందస్తు వెరిఫికేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. వీసా నిబంధనల్లో చేసిన మార్పుల వల్ల సౌదీ అరేబియాలో ఉన్న సుమారు 24 లక్షల మంది ప్రవాస భారతీయులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.