గెటప్ శ్రీను హీరోగా రూపొందిస్తున్న చిత్రం రాజు యాదవ్. అంకిత ఖరత్ కథానాయిక. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా థిస్ ఈజ్ మై దరిద్రం అంటూ సాగే గీతాన్ని సుడిగాలి సుధీర్ చేతులమీదుగా మేకర్స్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ ఆలపించారు. ఈ పాటలో హీరోకు ఎదురయ్యే అనుభవాలు నవ్వులు పంచుతాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రేమ, వినోదంతోపాటు మనసుల్ని హత్తునే భావోద్వేగాలు కూడా ఈ కథలో ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు ఇతర పాత్రధారులు. మే 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్.