Namaste NRI

అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన మోస్ట్‌ ఎవైటెడ్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి. అగ్ర నటి విజయశాంతి కీలక భూమిక పోషించారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకుడు. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మాతలు. తల్లీకొడుకుల అనుబంధమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ సినిమాలోని రెండోపాటను మేకర్స్‌ విడుదల చేశారు. ముచ్చటగా బంధాలే అంటూ సాగే ఈ పాటను రఘురామ్‌ రాయగా, అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. హరిచరణ్‌ ఆలపించారు. అమ్మ స్వభావాన్ని హైలైట్‌ చేస్తూ రఘురామ్‌ ఈ పాట రాశారని, కొడుకు విజయం కోసం తపించే తల్లి మనసు ఈ పాటలో ఆవిష్కృతం అయ్యిందని మేకర్స్‌ తెలిపారు. తల్లీకొడుకుల ప్రేమతోపాటు సాయి మంజ్రేకర్‌తో హీరో రిలేషన్‌ని కూడా ఈ పాటలో చూడొచ్చు. సోహైల్‌ఖాన్‌, శ్రీకాంత్‌, యానిమల్‌ పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్‌ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్‌, నిర్మాణం: అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News