Namaste NRI

సీనియర్ నటి జమున ఇకలేరు

తెలుగింటి సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా వయోసంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

1936 ఆగస్ట్ 30న నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు హంపీలో జమున జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆమెపేరు జానాబాయి. అయితే జ్యోతిషుల సూచనతో ఆమె పేరును జమునగా మార్చారు. నటుడు జగ్గయ్య.. ఖిల్జీరాజు పతనం అనే నాటకంలో పాత్రకోసం జమునను ఎంపిక చేశారు. అనంతరం ఆమె అడుగులు సినిమావైపు పడ్డాయి. 14 ఏండ్ల వయస్సులోనే సినిమాల్లోకి ప్రవేశించారు. 1953లో నటించిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 198 సినిమాల్లో ఆమె నటించారు. ఇందులో తెలుగులో 145 సినిమాలు ఉండగా, తమిళం 20, కన్నడం 7, హిందీలో 10 చిత్రాల చొప్పున ఉన్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తొలితరం నాయిక జమున కావడం విశేషం. భర్త, పిల్లల కోసం ఆమె తన మకాంను హైదరాబాద్ బంజారాహిల్స్కు మార్చారు. ఇక్కడి వచ్చిన తర్వాత ఆమెకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆహ్వానంతో 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. 1991 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీచేయగా ఓటమిచవిచూశారు. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events