భారత్ ఎన్నికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరెవర్నో గెలిపించాలని మాజీ అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్ఐఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఓటింగ్ కోసం మనం 181 కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి? వాళ్లు(బైడెన్ యంత్రాంగం) భారత్లో మరెవర్నో గెలిపించాలని ప్రయత్నించారని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చెప్పాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
