బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న సినిమా డంకీ. ఈ చిత్రానికి అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా, బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డంకీ డ్రాప్ 1 – ఫస్ట్ వీడియో, ఇంట్రెస్టింగ్ పోస్టర్లు విడుదల చేయగా ప్రతీ ఒక్కరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నాయి. డంకీ డ్రాప్ 2 రూపంలో డంకీ ఫస్ట్ సింగిల్ లుట్ పుట్ గయా సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో షారుఖ్ ఖాన్ ఫుల్ ఎనర్జీతో ఫన్‌గా సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందని సాంగ్ చెబుతోంది. షారుఖ్‌ఖాన్ ఎనర్జీ లెవల్స్‌తో సాగే డ్యాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడం పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. స్వానంద్ కిర్‌కిరే, ఐ.పి.సింగ్ రాసిన ఈ పాటను అర్జీత్ సింగ్ పాడగా, గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేశాడు.
డంకీ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానుంది.