శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు శర్వా పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు మనమే అనే టైటిల్ ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శర్వానంద్ పక్కనే చిన్న బాబు కనిపిస్తున్నారు. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కథానుగుణంగా లండన్, హైదరాబాద్‌లో సినిమాను షూట్ చేశారని సమాచారం.
