
హీరో శర్వానంద్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మాళవిక నాయర్ కథానాయిక. శర్వా36 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమాలోని శర్వా లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. టోర్న్ జీన్స్, ైస్టెలిష్ స్పోర్ట్స్ జాకెట్, షేడ్స్ ధరించి యమహా ఆర్‌ఎక్స్-100 బైక్‌పై కూర్చున్న శర్వాను ఈ లుక్‌లో చూడొచ్చు. ఈ పోస్టర్‌లో శర్వానంద్ కూల్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లో సవాలుతో కూడిన పాత్రను ఇందులో చేస్తున్నారని, ఉద్రేకపూరితమైన పోరాటాలతో అదరగొట్టనున్నారని, మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని, ఇది మూడు తరాల కథ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: గిబ్రాన్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్.
