
కంటెంట్ ఓరియెంటెడ్‌గా రూపొందుతున్న సస్సెన్స్ థ్రిల్లర్ వైల్డ్ బ్రీత్. హరినాథ్ పులి దర్శకుడు. పర్వతనేని రాంబాబు, డా.మురళీచంద్ గింజుపల్లి నిర్మాతలు. నిర్మాత పర్వతనేని రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. నటుడు శివాజీరాజా ఈ పోస్టర్‌ని లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. వైల్డ్ బ్రీత్ ఉత్కంఠకు గురిచేసే సస్సెన్స్ థ్రిల్లర్.షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని దర్శకుడు హరినాథ్ పులి తెలిపారు. పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను దర్శకుడు హరినాథ్ పులి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అని చెప్పారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన కె.ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కూడా మాట్లాడారు.
