Namaste NRI

ఎల‌న్ మ‌స్క్‌కు షాక్

 బిలియనీర్  ఎల‌న్ మ‌స్క్‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న కంపెనీ స్పేస్ఎక్స్ చేపట్టిన 8వ స్టార్‌షిప్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. నింగికెగిరిన కొన్ని క్ష‌ణాల‌కే ఆ వ్యోమ‌నౌక పేలింది. కానీ ఆ షిప్‌లోని బూస్ట‌ర్ మాత్రం నిర్దేశిత లాంచ్ ట‌వ‌ర్‌కు చేరుకున్న‌ది.   కానీ స్పేస్ఎక్స్ సంస్థ స్వ‌ల్ప ల‌క్ష్యాల‌ను సాధించింది. రాకెట్‌కు చెందిన బూస్ట‌ర్‌ను విజ‌య‌వంతంగా లాంచ్ ట‌వ‌ర్‌కు తీసుకురాగలిగింది. స్టార్‌షిప్ వ్యోమ‌నౌక పేలిన దృశ్యాలు వీడియోల‌కు చిక్కాయి. కొంద‌రు స‌ముద్రం నుంచి, కొంద‌రు విమానాల నుంచి ఆ వీడియోలు తీశాయి. ఆ వ్యోమ‌నౌక శ‌క‌లాలు బ‌హ‌మాస్‌లో ప‌డిన‌ట్లు గుర్తించారు. అయితే స్టార్‌షిప్ పేలిన స‌మ‌యంలో,  ఫ్లోరిడా నుంచి విమాన రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. కొన్ని విమానాల‌ను నిలిపివేశారు.

ద‌క్షిణ టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ నుంచి స్టార్‌షిప్‌ను ప్ర‌యోగించారు. 232 అడుగుల ఎత్తైన సూప‌ర్ హెవీ రాకెట్ బూస్ట‌ర్‌ను ఈ ప్ర‌యోగంలో పరీక్షించారు. స్టార్‌షిప్ ఎగిరిన 20 సెక‌న్ల‌కే , స్పేస్ఎక్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. లైవ్‌స్ట్రీమ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అనేక ఇంజిన్లు తెగిపోయాయి. ఇంజిన్ల‌తో లింక్ తెగిపోవ‌డం వ‌ల్ల‌,  ఆల్టిట్యూడ్ కంట్రోల్ త‌ప్పుతుంద‌ని స్పేస్ఎక్స్ క‌మ్యూనికేష‌న్ మేనేజ‌ర్ డాన్ హౌట్ తెలిపారు. ఫ్లోరిడా, క‌రీబియ‌న్ దీవుల నుంచి కూడా స్టార్‌షిప్ పేలుడు దృశ్యాలు క‌నిపించాయి.

Social Share Spread Message

Latest News