డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనల కారణంగా, భారత్‌తోపాటు చైనా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా జారీచేసే వీసాల్లో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే పొందుతుంటారు. విద్యార్థి, వర్క్, టూరిస్ట్ తదితర వీసాలు పొందే వారిలో భారత్, చైనాకు చెందిన వారే అధికంగా ఉంటారు. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత అక్రమ వలసలను నియంత్రించే క్రమంలో వీసా నిబంధనలను కఠినతరం చేశారు. వీసాల సంఖ్యను సైతం క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.

గత ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో కేవలం 2.5 లక్షల వీసాలను మాత్రమే జారీచేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాది అమెరికా హోం శాఖ శాశ్వత నివాసం, తాత్కాలిక నివాసం కోసం జారీచేసే వీసాలను 11 శాతం తగ్గించినట్టు తెలిపింది. నిరుడు భారత్, చైనా పౌరులకు దాదాపు 84 వేల వీసాలను తగ్గించిందని, దీంతో అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయిందని పేర్కొన్నది.















