Namaste NRI

మిరాయ్ లో అంబికగా శ్రియ శరణ్‌  .. స్పెషల్ పోస్టర్ రిలీజ్

తేజ సజ్జా హీరోగా సూపర్‌ హీరో కథాంశంతో రూపొందుతున్న చిత్రం మిరాయ్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంబిక అనే కీలక పాత్రలో సీనియర్‌ నటి శ్రియ నటిస్తున్నారు. హీరో మదర్‌ క్యారెక్టర్‌ ఇదని, కథాగమనంలో ప్రధాన భూమిక పోషిస్తుందని మేకర్స్‌ అంటున్నారు. అంబిక పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అంబిక పాత్ర భావోద్వేగభరితంగా సాగుతుందని, తనయుడి లక్ష్యసాధనలో ఆమె ఎలాంటి పాత్ర పోషించిందన్నది ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. రితికా నాయక్‌, జయరామ్‌, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని.

Social Share Spread Message

Latest News