నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తమ్ముడు . హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విఛాన్ చేశారు. వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం. అందరిని అలరించే కథ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సేతు, నిర్మాత: దిల్‌రాజు-శిరీష్, రచన-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.
