టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ నటిస్తోన్న చిత్రం టక్కర్. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీకి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జీ జయరామ్, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిష్కాంత్, విఘ్నేశ్ కాంత్, రామ్‌దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో టక్కర్ తెరకెక్కుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో అర్థమవుతోంది.


ఇటీవలే టక్కర్ టీజర్‌తోపాటు కయ్యాలే వీడియో సాంగ్ ను లాంఛ్ చేయగా, మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 26న ప్రేక్ష కుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల తేదీని వాయిదా వేసినట్టు తెలియజేశారు మేకర్స్. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
