
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా. ఈ సినిమాతో నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఎక్కడా కట్స్ లేకుండా సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 16 నిమిషాలుగా ఉందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో సిద్ధు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తుండగా. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
















