మనోజ్‌కుమార్, ఆశిత రెడ్డి జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ నిశ్శబ్ద. రమణమూర్తి తంగెళ్లపల్లి దర్శకుడు. శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. కథానుగుణంగా రాత్రి వేళల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేశామని, డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని, కథలోని మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయని దర్శకుడు తెలిపారు.

తన పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉందని, విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నానని, అభినయ ప్రధానమైన పాత్రలో నటించానని ఆశిత రెడ్డి చెప్పింది. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రమిదని హీరో మనోజ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణమూర్తి తంగెళ్లపల్లి.
