Namaste NRI

సిల్క్‌ స్మిత బయోపిక్‌.. హీరోయిన్‌గా ఎవరంటే?

స్వర్గీయ నటి, ప్రఖ్యాత నాట్యతార సిల్క్‌స్మిత బయోపిక్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. సిల్క్‌స్మిత – క్వీన్‌ ఆఫ్‌ ది సౌత్‌ అనేది టైటిల్‌.  ఎస్ టిఆర్ఐ సినిమాస్‌ పతాకంపై ఎస్‌.బి.విజయ్‌ అమృత రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయరామ్‌ శంకరన్‌ దర్శకుడు. ఈ అఫీషియల్‌ బయోపిక్‌లో సిల్క్‌స్మితగా చంద్రిక రవి కనిపించనున్నారు. సిల్క్‌స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనతోపాటు ఓ ప్రత్యేకమైన వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు.

బాలీవుడ్‌ డర్టీ పిక్చర్‌ చిత్రం సిల్క్‌స్మిత బయోపిక్‌గా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమె జీవితానికి సంబంధిం చిన కొన్ని అంశాలను ఆ సినిమాలో పొందుపరిచడంతో సినిమాపై మంచి హైప్‌ ఏర్పడి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రాబోతున్న సిల్క్‌స్మిత – క్వీన్‌ ఆఫ్‌ ది సౌత్‌  చిత్రం సిల్క్‌ స్మిత అధిరారిక బయోపిక్‌ కావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress