కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కోనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ విభాగం రజత పతకం సాధించింది. మలేషియాతో జరిగిన ఫైనల్లో 1`3 తేడాతో ఇండియా ఓడిపోయింది. దీంతో ఇండియన్ జట్టు కేవలం సిల్వర్‌తో సరిపెట్టుకున్నది. భారత్ జట్టులో కేవలం పీవీ సింధు మాత్రమే మలేషియాతో జరిగిన మహిళల సింగిల్స్‌లో తన మ్యాచ్ నెగ్గింది. ఇండియన్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డిలు పోరాడు ఓడారు. ఆ ఇద్దరు టెంగ్ ఫాంగ్, పూయి ఇక్ చేతితో 21`18, 21`15 స్కోర్‌తో ఓడిపోయారు. ఇక రెండవ మ్యాచ్‌లో పీవీ సింధు 22`20, 21`27 తేడా స్కోర్‌తో జిన్ వెయి గోపై విజయం సాధించింది. ఇక మూడవ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19`21, 21`6, 16`21 స్కోర్‌తో నెగ్ తెజ్ యాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ మ్యాచ్ గంటా ఆరు నిమిషాలు సాగింది. నాలుగవ మ్యాచ్‌లో ట్రెస్సా జాలీ, గాయత్రి గోపిచంద్ ఓడిపోయారు. ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 పతకాలు ఉండగా అందులో 5 స్వర్ణం, ఐదు రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి.














